Mane Praveen

May 02 2024, 11:51

NLG: ఉచితంగా విద్య- వైద్యం అందిస్తాం

పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఉచితంగా విద్య- వైద్యం అందిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మరిగూడ మండలం తమ్మడపల్లె, తిరుగండ్లపల్లి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం మరియు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.

సిపిఎం పోరాట ఫలితంగానే ఉపాధి హామీ చట్టం వచ్చిందని అయినప్పటికీ రోజు కూలి వంద మాత్రమే ఇస్తున్నారని అన్నారు. సిపిఎం అభ్యర్థులు గెలిపించినట్లయితే ఉపాధి హామీ రోజు కూలి రూ. 600 తో పాటు 210 పని దినాలు గ్యారెంటీ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.

రోజుకు ఒక పార్టీ మారే నాయకులను నమ్మొద్దని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాజ్యాంగాన్ని తొలగించడానికి కుట్రలు చేసే వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే పోలింగ్ రోజు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మహమ్మద్ జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య , వెంకటయ్య అంజయ్య చారి, దామెర లక్ష్మి, ఆయిలు కృష్ణయ్య, ప్రతాపరెడ్డి అమృత, యాదమ్మ, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 01 2024, 19:02

మే డే స్ఫూర్తిని కొనసాగిద్దాం: నెల్లికంటి సత్యం సిపిఐ జిల్లా కార్యదర్శి
చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మే డే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా  పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. 138 వ మేడే దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ అరుణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు.

చికాగో నగరంలో చిందిన రక్తం ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు నాంది పలికిందని అనేక కార్మిక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, పెట్టుబడుదారు వ్యవస్థకు పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా చట్టాలు చేస్తూ కార్మిక వర్గానికి ద్రోహం చేస్తుందన్నారు.

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తూ కార్మిక వర్గాన్ని మరింత దోపిడికి గురి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరస్వామి,గురిజ రామచంద్రన్,  నరసింహ, వెంకటేశ్వర్లు, లెనిన్, ముత్యాలు, వెంకన్న, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 01 2024, 18:17

కార్మికుల శ్రమ వలన వచ్చే అదనపు విలువ పంపిణీ జరగాల్సిందే: సిపిఎం

NLG: కార్మికులు తమ రక్తం దారపోసి శ్రమిస్తే వచ్చే అదనపు లాభం ద్వారానే పెట్టుబడుదారులు సంపద పోగేస్తున్నారని, కార్మికులకు అదనపు విలువ పంపిణీ జరగాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మర్రిగూడ మండల కేంద్రంలో మే డే సందర్భంగా సిపిఎం జెండా ఆవిష్కరించి మాట్లాడారు.

పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని దినం తీసుకురావడం అంటే శ్రామికుల శ్రమను దోపిడి చేయడమేనని, పెట్టుబడుదారుల కొమ్ము కాయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షకుల జీవితాలతో చలగాటమాడుతుందని ఆరోపించారు. ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

మే డే సందర్భంగా మర్రిగూడ మండలంలో ఇందుర్తి, శివన్న గూడెం, మర్రిగూడెం కేంద్రాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యుల మైలసత్తయ్య, కొట్టంయాదయ్య , పోలే పల్లి రాములు, పగిళ్ల రామచంద్రం లపంగి లింగయ్య, వెంకటయ్య, లక్ష్మణ్,ముత్యాలు, నరేష్, ఐద్వా మండల నాయకురాలు దామెర లక్ష్మి , హేమలత, ఇందిరమ్మ, సిద్ధగొని మహేష్, పిట్టల రమేష్ , సుప్పరి హనుమంతు, శ్రీరాములు, మారగోని సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 01 2024, 07:17

NLG: పోలింగ్ సిబ్బంది కి శిక్షణ తరగతులు

నల్గొండ పార్లమెంటు ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ, ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుండి 4 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. 

పోలింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

 ఈ ఉత్తర్వులను మే ఒకటి నాటికి సంబంధిత అధికారులు పంపిణీ చేయాలని ఆదేశించారు.

రెండో విడత శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు రెండు విడతల శిక్షణ కార్యక్రమాలు వారికి విధులు కేటాయించిన అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. 

Mane Praveen

Apr 30 2024, 16:19

బిజెపితోనే అభివృద్ధి సాధ్యం: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి

దేశం మరింత అభివృద్ధి చెందాలంటే బిజెపితోనే సాధ్యమవుతుందని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని కోరుతూ, గుండాల మండలం, వంగాల గ్రామం 272 వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి మాట్లాడుతూ... వారసత్వ రాజకీయాలు అవినీతి పాల్పడే పార్టీలు ప్రజల అభివృద్ధి చేయలేవని, ప్రజలకు తెలియజేప్పుతూ మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు.మూడవసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు.

మరోసారి బిజెపిని గెలిపించి అభివృద్ధిని చేసే అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజు సింగారం, గంగాపురం రమేష్, ఇమ్మడి నాగరాజు, ఆవుల సాయితేజ , కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 30 2024, 15:55

భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో ఈ రోడ్ షో కార్యక్రమానికి జనం వచ్చారు. అశేష జనం ను చూసిన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రావడం ఖాయం అని అన్నారు.

ఈ రోడ్ షో కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పున్నా కైలాస్ నేత, నియోజకవర్గం కోఆర్డినేటర్ బొజ్జ సంధ్యా రెడ్డి, సిపిఐ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 30 2024, 11:33

NLG: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి

నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో జెడ్పిటిసి ఏవి రెడ్డి సహకారంతో మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే అబ్బాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన, మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొదటి విజేతగా నాంపల్లి టీం, 2వ విజేతగా పసునూరు టీం, 3వ విజేతగా మెల్లవాయి టీం గెలుపొందారు. 

గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ బహుమతిగా రూ.20,116, ద్వితీయ బహుమతిగా రూ.15,166, తృతీయ బహుమతిగా రూ.7,166 లు మరియు షీల్డ్ లను ప్రధానోత్సవం చేశారు. 

ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ... యువత క్రీడారంగంలో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి ,మండల నాయకులు గెల్వాల్ రెడ్డి, క్రీడాకారులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 29 2024, 22:02

NLG: హాకీ వేసవి క్రీడా శిక్షణ శిబిరం

నల్లగొండ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మేకల అవుట్డోర్ స్టేడియంలో ఉచిత సమ్మర్ కోచింగ్ హాకీ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కొండ విజయకుమార్ విచ్చేసి క్రీడాకారులకు హాకీ స్టిక్స్, బాల్స్, క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా హాకీ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుందని, తద్వారా 18 మంది జాతీయస్థాయి క్రీడాకారులు తయారయ్యారని కితాబు ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కూతురు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నల్లగొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

నల్లగొండ హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం మాట్లాడుతూ.. జిల్లాకు 2 ఖేలో ఇండియా హాకీ సెంటర్లు కేటాయించడం అనేది జిల్లా అదృష్టమన్నారు.

నల్లగొండ హాకీ అసోసియేషన్ చైర్మన్ కూతురు లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసచారి, ఫరూక్, యావర్, అజిత్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 29 2024, 20:31

కాంగ్రెస్ పార్టీ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ,తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన అమిత్ రెడ్డి ఇప్పటికే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 29 2024, 20:15

NLG: నాంపల్లి మండలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

నాంపల్లి: మండలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. 

మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ మరియు నాంపల్లి మండల ఇన్చార్జ్ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలను నాంపల్లి మండలం నుంచి మంచి మెజార్టీ సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఏవి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య, కుంభం కృష్ణారెడ్డి, మండల వైస్ ఎంపీపీ పానగంటి వెంకన్న రజిని, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మండల నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము బిక్షం, ఎస్కే గఫర్, నాంపల్లి మండల టౌన్ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య గౌడ్, సుంకిశాల మాజీ సర్పంచ్ కలకొండ దుర్గయ్య, గాదేపాక రాజు, పూల యాదగిరి, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ కాంశెట్టి యాదయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని గ్రామాల సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG